Sunday, 26 April 2026 06:33:55 PM
# *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం..

క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు.

క్లాక్ టవర్ సెంటర్ లో ముడు భారీ వాహనాల హడావిడి – 50 నిమిషాలపాటు ప్రజల నరకయాతన..సోషల్ మీడియా స్పందనతో కదిలిన యంత్రాంగం – క్లాక్‌టవర్ ట్రాఫిక్ క్లియర్!

Date : 20 April 2026 10:14 PM Views : 578

కలం పవర్ న్యూస్ - సోషియల్ మీడియా వైరల్ / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, ఏప్రిల్ 20 ( కలం పవర్ న్యూస్ బ్యూరో) మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీ ప్రదేశమైన క్లాక్‌టవర్ కూడలి వద్ద నేడు భారీ కంటైనర్ వాహనం ప్రవేశించడంతో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. గంటల తరబడి వాహనాలు కదలకపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనులపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో పగటి పూట, ముఖ్యంగా సాయంత్రం సమయంలో భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం ఉన్నప్పటికీ, ఆ నియమాలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత భారీ వాహనం పట్టణ హృదయంలోకి ఎలా ప్రవేశించింది.? పోలీస్ శాఖ నిఘా ఎక్కడ విఫలమవుతోంది.? అనే ప్రశ్నలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ వంటి ప్రధాన కూడలిలో ట్రాఫిక్ నియంత్రణలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు సమయానికి స్పందించకపోవడం, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల పరిస్థితి మరింత విషమించిందని వాహనదారులు మండిపడుతున్నారు. “నియమాలు ఉన్నాయే గానీ అమలు లేదు… పోలీసులు ఉన్నారే గానీ కనిపించడం లేదు” అంటూ స్థానికులు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఇప్పటికైనా పోలీస్ శాఖ మేల్కొని కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ వాహనాలపై కట్టడి విధించాలని, ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “ట్రాఫిక్ జామ్ కాదు… వ్యవస్థ జామ్ అయింది!” అంటూ ఈ ఘటనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. *సోషల్ మీడియా స్పందనతో కదిలిన యంత్రాంగం – క్లాక్‌టవర్ ట్రాఫిక్ క్లియర్!* -*తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు* మహబూబ్‌నగర్ పట్టణంలోని క్లాక్‌టవర్ కూడలిలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్‌పై జిల్లా పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించి ట్రాఫిక్‌ను సక్రమంగా క్లియర్ చేయడం పట్ల పట్టణ ప్రజలు సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సమస్యను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు లేవనెత్తిన వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ సిబ్బందిని క్షేత్రస్థాయికి పంపడం విశేషం. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి రహదారిని అడ్డుకున్న భారీ కంటైనర్ వాహనాన్ని తరలించి ట్రాఫిక్‌ను సజావుగా నడిపించారు. ఈ వేగవంతమైన చర్యలతో గంటల తరబడి ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. “ప్రజా సమస్యలపై ఇలాగే వెంటనే స్పందిస్తే మరిన్ని సమస్యలు తీరుతాయి” అంటూ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం చూపిన పోలీస్ శాఖకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ, ఇదే స్పందన భవిష్యత్తులో కూడా కొనసాగాలని కోరుతున్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :