Sunday, 26 April 2026 07:54:59 PM
# *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం..

*“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Date : 26 April 2026 05:46 PM Views : 19

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) మహబూబ్‌నగర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం క్రౌన్ గార్డెన్‌లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు మరియు రాజకీయ నాయకులు వేరు కాదని, ఇద్దరూ సమాజ సేవకులేనని పేర్కొన్నారు. జర్నలిస్టులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని తెలిపారు. తాను చేస్తున్న సహాయ కార్యక్రమాలను వక్రీకరించి చూడొద్దని విజ్ఞప్తి చేసిన ఆయన, మంచి పనులను ప్రజలకు చేరవేయడం జర్నలిస్టుల బాధ్యత అని స్పష్టం చేశారు. అదే సమయంలో తప్పులు జరిగితే వాటిని సరిదిద్దే బాధ్యత కూడా మీడియాదేనని అన్నారు. “మీ కలానికి ముగింపు లేదు… రాజకీయాలు శాశ్వతం కాదు” అంటూ సమాజంలో మీడియా ప్రాముఖ్యతను ఆయన గుర్తుచేశారు. పాలమూర్ ప్రాంత ప్రశాంతత కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే, తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. గర్భిణీల కోసం ప్రారంభించిన యెన్నం హెల్త్ కిట్ల పథకం కింద ఇప్పటివరకు 850 కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. యెన్నం హెల్త్ కార్డు ద్వారా అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ప్రెస్ క్లబ్‌కు ప్రింటర్, కంప్యూటర్ అందించేందుకు హామీ ఇచ్చిన ఆయన, బాధ్యతలను విస్మరిస్తే సమాజానికి నష్టం కలుగుతుందని హెచ్చరించారు. జర్నలిస్టులు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తారని, విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపరిచేందుకు 20 వేల మందికి మార్పు తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఏటీసీ సెంటర్‌లో నూతన సదుపాయాలు కల్పిస్తున్నామని, మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో ముందంజలో నిలపడం తన లక్ష్యమని చెప్పారు. నాయకులు సరైన మార్గంలో నడవడానికి ప్రజలు, జర్నలిస్టులు ఇచ్చే సూచనలు, సలహాలు ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :