Friday, 19 June 2026 02:30:26 PM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్

యువతకు ప్రభుత్వానికి సమన్యయకర్తగా వ్యవహరిస్తా - పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ఎస్ యూఐ కీలకపాత్ర - ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంక

Date : 28 January 2024 08:36 AM Views : 1229

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఎమ్మెల్సీ పదవితో నాపై మరింత బాధ్యత పెరిగిందని, యువతకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తానని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన 'మాట్లాడారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దేశ చరిత్రలో 31 ఏళ్ల చిన్న వయస్సులో తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ. రాహుల్ గాందీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర ఎమ్మెల్యేలు, నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్న. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ఎస్ యూ ఐ ను సన్నద్ధం చేయడానికి మహబూబ్నగర్ నుంచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ఎస్ యూ ఐ నాయకులు ప్రతి ఓటరు వద్దకు వెళ్లి కాంగ్రెస్ సిద్ధాంతాలు, కార్యక్రమాల గురించి వివరించాలన్నారు. ప్రతి యువకుడిని చైతన్య పరిచి ప్రతి పార్లమెంట్ నుంచి లక్షమెజార్టీకి తక్కువగా కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందామని అన్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అత్యధిక సమయం కేటాయించి వంశీచంద్ రెడ్డి గెలుపులో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. సమావేశంలో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, జిల్లా మీడియా సెల్ సీజే బెనహర్, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అవేజ్, రాష్ట్ర కార్యదర్శి ముకుందం రమేశ్, నాయకులు లలిత్ యాదవ్, కృష్ణవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: