కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : ఆర్యవైశ్యుల చిరకాల కోరిక ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చొరవతో కల సాకారం జరగింది ఎన్నికల సందర్భంగా ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీని 100 రోజుల లోపే అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడంపై నాగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ హర్షం వ్యక్తం చేసింది గురువారం నాగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు చెప్పారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విద్యా కమిటీ చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్ ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు చెప్పారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ మాట్లాడుతూ కార్పొరేషన్ కోసం ఆర్యవైశ్యులు 10 సంవత్సరాలుగా దశల వారి ఆందోళనలు జరిపిన సంగతి అందరికీ తెలుసు అన్నారు కామారెడ్డి లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం గొప్ప విషయం ఇది ఆర్యవైశ్యులకు మేలు చేస్తుందని బచ్చు రామకృష్ణ అన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నాగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు చెప్పారు, నాగర్ కర్నూల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జూలూరు రమేష్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బలుస శ్రీరాములు, నాగర్ కర్నూలు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జూలూరు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బిల్ల కంటి రవికుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శి కల్మచర్ల రమేష్ జిల్లాకోశాధికారి శివ జగదీశ్వర్, అదనపు ప్రధాన కార్యదర్శి చిగులపల్లి శ్రీధర్, వెల్దండ అధ్యక్షుడుఉప్పు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News