కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్థాపించిన విద్యా నిధి తో మహబూబ్ నగర్ లో ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని రిషి విద్యా సంస్థల డైరెక్టర్లు తెలిపారు. అందుకు మా వంతు సహకారం అందించాలనే సంకల్పంతో రెండు లక్షల రూపాయలను అందిస్తున్నామని వారు ఎమ్మెల్యే కు తెలిపారు. ఎమ్మెల్యే ఆశయం మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయుటకు మా వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీరు ఇచ్చిన ఈ ప్రోత్సహం మాకు మరింత బలం ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,రిషి డైరెక్టర్లు పూజిత మోహన్ రెడ్డి, చంద్రకళ, సుశాంత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News