Sunday, 26 April 2026 07:55:21 PM
# *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం..

సిగ్నల్ గడ్డ రోడ్డుకు 30 రోజుల్లో మోక్షం నేషనల్ హైవే అథారిటీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

Date : 23 September 2024 06:35 PM Views : 990

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : జడ్చర్లవాసులకు సంకటంగా మారిన సిగ్నల్ గడ్డ రోడ్డు సమస్యను నెల రోజుల్లో పరిష్కరిస్తామని నేషనల్ హైవే ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయం గురించి తాను హైవే అథారిటీ అధికారులతో ప్రత్యేకంగా కలిసి సిగ్నల్ గడ్డ రోడ్డు గురించి ఫిర్యాదు చేసానని చెప్పారు. జాతీయ రహదారి నెంబర్ 167 నిర్మాణ పనుల్లో భాగంగా జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్ గడ్డ ప్రాంతంలో వంతెనతో పాటుగా రోడ్డును నిర్మిస్తున్నారు. అయితే ఈ నిర్మాణ పనులను చేపట్టిన కాంట్రాక్టర్ ఉదాసీనత, రైల్వే శాఖ నుంచి కొన్ని క్లియరెన్స్ లు రావాల్సి ఉండటం లాంటి వివిధ కారణాలతో ఈ రోడ్డు నిర్మాణం సంవత్సరాల తరబడిగా కొనసాగుతోంది. పనులను కొంత కాలం చేసిన గుత్తేదారు వివిధ కారణాలను చూపుతూ నిర్మాణ పనులను చాలా కాలంగా నిలిపివేయడంతో ఏళ్ల తరబడిగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణపనుల్లో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగడంతో పాటుగా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ప్రత్యేకించి వర్షాల కారణంగా ఈ రోడ్డు గుంతల్లో బురద పేరుకుపోవడంతో ఆ ప్రాంతంలో ప్రజలు తిరగడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఈ విషయం గురించి ప్రజలు ఫిర్యాదులు చేసినా ఆయన పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనిరుధ్ రెడ్డి సోమవారం నేషనల్ హైవే అథారిటీ అధికారులకు ఈ రోడ్డు గురించి ఫిర్యాదు చేసారు. నేషనల్ హైవే అథారిటీ రీజనల్ హెడ్ కృష్ణ ప్రసాద్ కు జడ్చర్ల సిగ్నల్ గడ్డ రోడ్డు దుస్థితిని, ఈ విషయంలో కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యాన్ని గురించి ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం సిగ్నల్ గడ్డ రోడ్డు దుస్థితికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా ఆయనకు చూపించారు. ఈ విషయంగా స్పందించిన ఆర్ఓ కృష్ణ ప్రసాద్ దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని, 30 రోజుల్లోపుగా సిగ్నల్ గడ్డలో బీటీ రోడ్డు వేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అనిరుధ్ రెడ్డి మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు. హైవే అధికారులు హామీ ఇచ్చిన విధంగానే నెల రోజుల్లో సిగ్నల్ గడ్డ రోడ్డు సమస్య పరిష్కారమౌతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. అధికారులు చెప్పిన గడువు లోపుగా సమస్య పరిష్కారం కాకపోతే ఈ విషయాన్ని తాను మరింత సీరియస్ గా తీసుకొని సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :