కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనాన్ని జరుపుకోవాలని జిల్లా వాసులందరికీ ఎస్పీ డి.జానకి ఆదేశాలు జారీ చేశారు. గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీలకు మరియు కమిటీ సభ్యులకు మరియు ప్రజలకు తెలియజేయడం ఏమనగా గణేష్ నిమజ్జనం దృష్ట్యా, శోభయాత్ర నిర్వహించువారు ఈ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించాలి. --- శోభయాత్రలో DJ సౌండ్ BOX లను ఉపయోగించరాదు. ఇలా ఉపయోగించిన సౌండ్ బాక్స్లను సీజ్ చేయడమే కాకుండా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడును. --- శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ వారు మరియు కమిటీ సభ్యులు బాధ్యత వహించవలెను. --- విద్యుత్ తీగలను మరియు వచ్చే పోయే వాహనాలను గమనించుకుంటూ యాత్రను. నిర్వహించవలెను. - శోభా యాత్రలో అశ్లీల నృత్యాలు గానీ మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను గాని అట్టి పాటల్ని గాని ప్రదర్శించరాదు. - శోభా యాత్రలో బాణాసంచా కాల్చుట పూర్తిగా నిషేధము, ఇట్టి విషయాన్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము. - నిమజ్జనం సమయంలో నీటి వద్ద తగు జాగ్రత్తలు పాటించవలెను మరియు నీటి వద్దకు చిన్న పిల్లలను రానీయకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమం చేయవలెను. - రెచ్చగొట్టే నినాదాలు చేయడం, మత స్థలాల దగ్గర ఊరేగింపులను ఆపడంవంటివి చేయరాదు. - కనులపండుగగా జరుగు గణేష్ నిమజ్జన యాత్రను ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎవరు కూడా ఇతర భక్తులకు కానీ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించరాదు. - ప్రతి విగ్రహం నిమర్జనం వీలైనంత త్వరగా బయలుదేరాలని, వాహనాలపై పరిమితికి మించి భక్తులు వెళ్లకూడదు. - నిమజ్జన రూట్లలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు సిబ్బందికి అందరూ సహకరించగలరు. - ప్రధానంగా గణేష్ నిమజ్జనం రూట్లో సి.సి కెమెరాల ఏర్పాటు చేయడం జరుగుతోంది., ఈ కెమెరాలు పూర్తిగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయడం జరిగిందని ఈ సి.సి టివిలు 24×7 ప్రకారంగా పూర్తిగా సిబ్బంది పర్యవేక్షణలో వుంటాయి. - నిమజ్జన సమయమున ఏమైనా ఇబ్బందులు తలెత్తినా జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712658360 కి గానీ 100 కి గానీ సంప్రదించగలరు. - నిమజ్జనం రోజు ఆయా రూట్లలో విద్యుత్ శాఖ, ఆర్ అండ్‌బీ శాఖల మరియు ఇతర అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనోత్సవం సాఫీగా సాగేలా భద్రతాపరమైన పూర్తి ఏర్పాట్లు, బందోబస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు
Admin
Kalam Power News