కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన రాష్ట్ర చేనేత ఐక్యవేదిక ముఖ్య నాయకుల సమావేశంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ కాల పరిమితి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఇట్టి సమావేశంలో 33 జిల్లాల చేనేత ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఇట్టి సమావేశంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షునిగా రాపోలు వీర మోహన్ ప్రధాన కార్యదర్శిగా గద్వాల నివాసి చేనేత కార్మిక సంఘం నాయకుడు మేడం రామకృష్ణ ను ఉపాధ్యక్షుడిగా కోమటిపల్లి సదానందం ను కోశాధికారిగా జెల్లా రఘు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు 33 జిల్లాల చేనేత ప్రతినిధుల అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యల పట్ల చేనేత కార్మికుల అభివృద్ధి కొరకు ప్రభుత్వానికి చేనేత పరిశ్రమకు మధ్యన వారధిగా ఉంటూ ఎల్లప్పుడూ చేనేత కార్మికుల అభివృద్ధి కొరకు నా వంతు కృషి చేస్తానని అదే విధంగా చేనేత కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఆధ్వర్యంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు 33 జిల్లాల చేనేత ప్రతినిధులు చేనేత కార్మికులు పద్మశాలి కుల బంధంలో తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
Kalam Power News