కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి శనివారం హైద్రాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లారు. మార్గమధ్యలో కల్వకుర్తి పట్టణంలోని రైస్ మిలర్స్ అసోసియేషన్ నాయకులు గోవింద్ శ్రీనివాస్ కుమారుడు మహేందర్ మనుమరాలు కొండూరు వ్రిందా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు మహేందర్ రెడ్డి నీ మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోవింద్ శ్రీనివాస్,దర్శి సాయిరాజ్, జూలూరి రవి,గోవింద్ కృష్ణయ్య లు కలిసి కల్వకుర్తి లో రైస్ మిల్లర్ లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కి విన్నవించారు. మిల్లర్ లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని, రైస్ మిల్లర్ లకు మద్దతుగా ఉంటానని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
Admin
Kalam Power News