కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : కాదేదీ చోరీకి అనర్హం అనే విధంగా వ్యవహారం నడుస్తోంది వ్యాపారులు నిల్వ ఉంచుకున్న ధాన్యాన్ని చోరీ చేశారంటే పక్కా ప్రణాళికతో నే అని పలువురు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ లో భాగంగా రైస్ మిల్లు వ్యాపారులకు ధాన్యాన్ని కేటాయించింది ధాన్యం పెద్ద ఎత్తున రావడంతో వ్యాపారులు తమ మిల్లులో స్థలం సరిపోక ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ గోదాములలో నిలువ చేసుకున్నారు కల్వకుర్తికు చెందిన సద్గురు రాఘవేంద్ర పారా బాయిల్డ్ మిల్లు యజమానికి ప్రభుత్వం సీఎంఆర్ లో భాగంగా జిల్లాలో అధికంగా ధాన్యం రావటం వల్ల ప్రభుత్వం మిల్లు గోదాం సామర్థ్యం నకు మించి అధిక ధాన్యం ఇవ్వటంతో వ్యాపారి రమేష్ బాబు వెల్దండ మండలం పెద్దాపూర్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ గోదాంలో నిల్వచేశారు అయితే గోదాం అద్దె చెల్లించలేదని మార్కెట్ అధికారులు వ్యాపారికి నోటీసులు జారీ చేసి గోదామును సీజ్ చేశారు, సీఎంఆర్ ధాన్యం నిల్వ ఉంచిన ప్రభుత్వం గోదాములకు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని వ్యాపారులు చెప్పిన మార్కెటింగ్ శాఖ అధికారులు జీవో కాఫీ చూపించాలని వితండవాదం చేసి సంవత్సర కాలంగా గోదాం తాళం చెవిలను తమ వద్ద ఉంచుకున్నారు అయితే ఇటీవల వనపర్తి జిల్లా చిన్నంబావి గ్రామంలో ధాన్యం చోరిలో నిందితుడు పట్టుబడ్డాడు ఆ సంఘటన మరువకముందే జిల్లాలోని బలుమూరు, కోడేరు గ్రామాలలో ఉన్న గోదాములలో ధాన్యం చోరీ జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సంఘటన సంచలనం సృష్టించింది, అయితే కల్వకుర్తిలో మరోసారి ధాన్యం చోరి సంఘటన వెలుగు చూడడంతో అందరూ అవాక్కయ్యారు, మిల్లర్ల వ్యవహారం కనిపెట్టిన వారే ఈ దొంగతనాలు చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దొంగతనానికి పాల్పడిన వారికి ఎవరైనా వెనక నుండి సహాయ సహకారాలు అందించారా అని అనుమానాల సైతం వెల్లువెత్తుతున్నాయి కోటి రూపాయలకు పైగా విలువ చేసే ధాన్యాన్ని ఎత్తుకెళ్లారంటే పకడ్బందీ ప్రణాళిక ప్రకారమే చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ప్రధాన రహదారి పక్కనే ఉన్న గోదాంలో లారీల ద్వారా లేదా ఇతర వాహనాల ద్వారా అయితేనేం ఇంత పెద్ద ఎత్తున చోరీ జరిగే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు, చిన్నంబావిలో చోరీ చేసిన ముఠాతో పాటు మరికొందరిని ఆరా తీస్తే అసలు విషయం వేలుగులోకి వస్తుందని పలువురు అంటున్నారు, సంవత్సర కాలంగా గోదాం తాళాలు ఇవ్వకుండా వ్యవహారం కొనసాగడం వల్లే సమస్య వచ్చిందని వ్యాపారి అంటున్నారు మార్కెట్ అధికారులు వివక్షపూరితంగా వర్ణిస్తూ కిరాయి చెల్లించని వారిని కొందరిని పట్టించుకోకుండా మరికొందరిని ఇబ్బందులు పెడుతూ కొత్త సమస్యకు తెర తీశారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి, ధాన్యం చోరీ చేసే ముఠా దర్జాగా వేల సంఖ్యలో ధాన్యం బస్తాలను ఎత్తుకెళ్లి కోట్ల రూపాయల నష్టం చేస్తుండటంపై అనేక సమస్యలు వస్తున్నాయి, బుధవారం పెద్దాపూర్ గ్రామంలోని గోదామును మార్కెటింగ్ అధికారులు తాళాలు, తీసి రమేశ్ బాబు ను పిలిపించారు దీంతో చోరీ సంఘటన వెలుగు వచ్చింది. *చోరీపై విచారణ చేయాలి* వెల్దండ మండలం పెద్దాపూర్ మార్కెటింగ్ శాఖ గోదాంలో రాఘవేంద్ర ఫారాబాయిల్డ్ మిల్లు కు చెందిన దాదాపు 15 వేల బస్తాల ధాన్యం చోరీ అయిందని చోరీకి పాల్పడిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించడంతోపాటు తనకు న్యాయం చేయాలని సద్గురు రాఘవేంద్ర పారాబైల్డ్ మిల్లు యజమాని జూలూరు రమేష్ బాబు కోరారు జిల్లాలోని ఇతర ప్రాంతాలలో జరిగిన చోరీకి ఇక్కడికి ఏమైనా సంబంధం ఉందా అనే అంశంపై దృష్టి సారించాలని చోరీ సంఘటనపై పోలీసులకు సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రమేష్ బాబు తెలిపారు.
Admin
Kalam Power News